ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుదుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తుపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా దృష్టి సారించారు.
నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న వేళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మూడు కీలక ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బాసర బ్రిడ్జి, కందకుర్తి, ఆర్మూర్‌లోని గూండ్ల చెరువు వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బాసర బ్రిడ్జి, కందకుర్తి, ఆర్మూర్‌లోని గూండ్ల చెరువు వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. నవీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాసర బ్రిడ్జి, రెంజల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందకుర్తి, ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూండ్ల చెరువు వద్ద నిమజ్జనానికి సంబంధించి చేపట్టిన భద్రతా చర్యలను సమీక్షించారు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
బందోబస్తులో భాగంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రజలు కూడా పోలీసు, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
బాసర బ్రిడ్జి వద్ద జరిగిన పర్యవేక్షణలో ఏఆర్ ఏసీపీ కృష్ణ, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. కందకుర్తి వద్ద బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఆర్మూర్‌లో ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
