HomePOLITICAL NEWSUncategorizedబాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజాగౌడ్

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజాగౌడ్

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) రాజాగౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన ఎస్.కిరణ్ కుమార్ పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా కొనసాగుతున్న రాజాగౌడ్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.

అంతకుముందు ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్ఓ గీత, కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిసి స్వాగతం పలికారు.

కాగా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఇదివరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ లలో రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్.డీ.ఓ)గా విధులు నిర్వర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments