నియామక పత్రాలు అందజేతరిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నీరడీ లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీ వివరాలను వెల్లడించారు.
రెండు రాష్ట్రాల ఇన్‌ఛార్జి మేజర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు, జాతీయ అధ్యక్షుడు భీమ్‌రావు అంబేడ్కర్ నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కమిటీని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా కొయ్యాడ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా మద్దెల సంతోష్, ప్రధాన కార్యదర్శిగా బోడ ప్రమోద్, కోశాధికారిగా తోట ఒడ్డెన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దండు రమేష్, జిల్లా కార్యదర్శిగా గుగ్గిల లక్ష్మణ్‌ను నియమించారు.
జిల్లా ఈసీ కమిటీ సభ్యులుగా అరుణ, కవిత యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా తారను ఎంపిక చేశారు. కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా మోతే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా షేక్ హైమద్‌కు బాధ్యతలు అప్పగించారు.
నూతనంగా నియమితులైన నాయకులకు డాక్టర్ నీరడీ లక్ష్మణ్ నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
