పారిశ్రామిక ప్రాంతమైన జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని గ్లాబా బ్లాక్‌లో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో సుదర్శన్ రావు (27), బాలాజీ (44) ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలియాల్సి ఉంది.
