నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలజాతీయ రహదారి మీద సోమవారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
డైరీ ఫామ్ కోసం పచ్చి గడ్డి ని ట్రాక్టర్ మీద తీసుకోని వెళ్తుండగా పడకల్ వద్ద వెనుక నుంచి భారీ ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ మీద ఉన్న ఒడ్డెన్న రాజేశ్వర్ లు అక్కడిక్కడే మృతి చెందారుల.
తీవ్రంగా గాయపడ్డ విజయ్ ,మహేష్ ల ను హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డిచ్ పల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించారు.
ఒడ్డెన్న ట్రాక్టర్ మీద ఉన్న గడ్డి కింద పడడంతో ట్రాక్టర్ ఫై నుంచి కిందికి వేగంగా దిగాడు ఆయన ను వారించబోయి రాజేశ్వర్ కూడా కిందికి దూకేసాడు అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వచ్చిన భారీ కంటెనర్ అదుపు తప్పి ఈ ఇద్దరు మీద నుంచి దూసుకెళ్లింది.
