కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం…
కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో ఓ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటన మెండోర మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. భువనగిరి జిల్లాకు చెందిన గట్టయ్య, మల్గా మధు,పెంటారెడ్డి, మరో 10 మంది కలిసి కుంభమేళా కు వెళ్ళారు.
తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో మెండోర మండలంలోనీ బుస్సాపూర్ గ్రామ జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకో ఢీ కొని బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
