శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమిని స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అరోపణలు చేశారు.సోమవారం నగరంలో బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి 14 నేలల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పలేరని విమర్శించారు. అలాగే అధికారంలోకి వచ్చిన నాటినుంచి పట్టభద్రుల,ఉపాధ్యాయులకు చేసిందేమీ లేదని ఆగ్రహించారు.
రేవంత్ రెడ్డి సమావేశం భూమరెడ్డి కన్వెన్షన్ లో కాకుండా గాంధీ చౌరస్తా లోకి వచ్చి పట్టభద్రుల సమస్యలపై అడిగి ఉంటే పరిస్థితి అర్థం అయ్యేదని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ…
అసెంబ్లీ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్టు వేసి ప్రజలను మోసం చేశారని ద్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ చేసింది. యువత, నిరుద్యోగుల పట్ల తామ స్టాండ్‌ను తెలియజేసే ఈ డిక్లరేషన్‌లో కీలక హామీలు వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి సిఎం రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు తీసుకొని, ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారనీ ఆరోపించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్,జాబ్ కేలండర్ విడుదల చేస్తామని,అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేశారని తెలిపారు.
15 నెలలో నిండు అసెంబ్లీలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల కోసం,ఉపాధ్యాయుల కోసం మాట్లాడలేదని, ప్రతిపక్షంలో ఉన్న మేము గొంతు ఎత్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు.
