HomeTelanganaNizamabadఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫోన్ ట్యాపింగ్ కేసు ను వాడుకున్నారు ......బిఆర్ యస్ ను బ్లాక్...

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫోన్ ట్యాపింగ్ కేసు ను వాడుకున్నారు ……బిఆర్ యస్ ను బ్లాక్ మెయిల్ చేసి దారి లోకి తెచ్చుకున్న కేంద్రం

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్ అరెస్టు కాకుండా బీజేపీ అడ్డు పడుతుందని వారికి రక్షణ ఉండాలని చూస్తుందని శాసన మండలి ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు వాడుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ నేతల బ్లాక్ మెయిల్ కు లొంగి పోయిన బిఆర్ యస్ అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థి ని పోటీ లోకి దింపలేదని పరోక్షంగా ఈ ఎన్నికలో బీజేపీ కి వోట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్ నగరం కు వచ్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రైవేట్ హల్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను అరెస్టు చేసి తాము జైళ్ల కు పంపామని వారంతా బెయిల్ తీసుకోని వచ్చేస్తున్నారని కానీ అసలు నిందితులు ప్రభాకర్ రావు ,శ్రవణ్ విదేశాల్లో దాక్కున్నారని వారి మీద రెడ్ కార్నర్ నోటిస్ జారీచేసి అమెరికా పంపాలని తాము కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేశామన్నారు కానీ ఇంకా రెడ్ కార్నర్ నోటిస్ అమెరికా కు పంపకుండా మోడీ సర్కార్ కాలయాపన చేస్తుందన్నారు.

అమెరికా లో అక్రమంగా ఉంటున్న వారిని ట్రాంప్ బేడీలు వేసి పంపిస్తున్నాడని మోడీ గట్టిగా అడిగితె వీళ్ళను ఎందుకు పంపాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ తాము పంపిన రెడ్ కార్నర్ నోటిస్ లను అడ్డం పెట్టుకొని కేటీఆర్ హరీష్ రావు లను పిలిచి బేరం పెట్టారని అందుకే ఆయన ఆరోపించారు.

కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలేమని బండి సంజయ్ అడుగుతుండు ఆయనే హోం సహాయ మంత్రి కదా ఒక్కసారి ప్రభాకర్ శ్రవణ్ లను ఇండియా కు రప్పిస్తే 24 గంటల్లో కెసిఆర్ కేటీఆర్ హరీష్ లను లోపలేస్తామన్నారు అంతెందుకు గొర్రల స్కామ్ కారు రేస్ కేసు ల్లో తాము కేసులు నమోదు చేసి దొంగల భరతం పట్టబోతే ఈడీ వచ్చి కాగితాలు తీసుకెళ్లింది.

ఈడీ వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేక పోతుందో బండి సంజయ్ చెప్పాలి. అభివృద్ధి పనులకు నిధులు అడుగుతున్నామని బుకాయిస్తూ ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్ హరీష్ అక్కడికి వెళ్లి రాయబారాలు చేసుకుంటున్నారు తెలంగాణ లో తమ ప్రభుత్వం వుంటే వాళ్ళు వెళ్లి ఏమి అడుగుతారని ఎద్దేవా చేసారు.

కెసిఆర్ సీఎం వుండగా ఎంత మంది పార్టీ పిరాయించలేదో బిఆర్ యస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలె పార్టీ జంప్ చేసిన సబితా శ్రీనివాస్ లు మంత్రులే అయ్యారు కదా మరి అప్పుడు రాని ఉప ఎన్నికలు ఎప్పుడు ఎలా వస్తాయన్నారు అప్పడే అదే స్పీకర్ ఇప్పుడే అదే స్పీకర్ అప్పటి కోర్టే ఇప్పుడున్నది కదా ఎలా ఉప ఎన్నిక వస్తాడన్నారు కేవలం ప్రజల ను మభ్య పెట్టడానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కేటీఆర్ కెసిఆర్ మాయ మాటలు చెప్తున్నారని ఆయన దుయ్యబట్టారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థి నిలబెట్టేచేతగాని బిఆర్ యస్ ఉప ఎన్నికలొస్తే తఢాఖా చూపిస్తామని ఎలా అంటారు అంటూ మండి పడ్డారు.

తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండే అనేక ప్రాజెక్ట్ లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలని అడ్డు పడుతున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధి తో కిషన్ రెడ్డి ఆయా కేంద్ర శాఖల మంత్రులకు చెప్పి ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్లకుండా చూస్తున్నాడని మెట్రో మూసి రీజనల్ రింగ్ లాంటి ప్రాజెక్ట్ ఇందులో ఉన్నాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments