ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా అక్రమంగా విక్రయిస్తున్న కల్లు దుకాణం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
ఈ నెల 27 న శాసనమండలి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 48 గంటల ముందే కల్లు దుకాణాలు,మద్యం దుకాణాలు మూసి వేయాలని తెలిపిన మంగళవారం సాయంత్రం నగరంలోని మూడవ టౌన్ పరిధిలోనీ అక్రమంగా విక్రయిస్తున్న కల్లు దుకాణం పై టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఈ మేరకు కల్లు దుకాణంలోని 1000 లీటర్లు కల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు నిమిత్తం మూడవ టౌన్ లో అప్పగించినట్లు సీఐ అంజయ్య పేర్కొన్నారు.
