HomeCRIMEఅదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు..నగరంలో అదృశ్యమైన వ్యక్తి నవిపేట్ మండలంలో శవమై కనిపించాడు.

అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు..నగరంలో అదృశ్యమైన వ్యక్తి నవిపేట్ మండలంలో శవమై కనిపించాడు.

ఈ ఘటనలో నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన గుమ్మడి శ్రీనివాస్(48). డ్రైవర్ గా పనిచేస్తాడు.

అయితే ఈ నెల 15 న కారు డ్రైవింగ్ పై కుంభ మెలకు వెళ్లి తిరిగి 17 న ఇంటికి వచ్చాడని తెలిపారు.వచ్చిన నాటి నుంచి ఇంటికి రాకపోవడంతో చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు దీంతో ఈ నెల 24 న నాలుగవ టౌన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు.

అయితే మంగళవారం నవిపేట్ మండలంలోని గాంధీ నగర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు తెలిపారు.

దీంతో ఆ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా శ్రీనివాస్ అని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments