నిజామాబాద్ పట్టణంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, పటిష్ట బందోబస్తు నడుమ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 8 గంటలకు ప్రారభంభమైన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉదయం 10 గంటలకు వరకు నగరంలో మందకొడిగా సాగిన పోలింగ్ తరువాత ఊపందుకుంది. నగరంలోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో, సీఎస్ఐ స్కూల్ , ఎస్ఎఫ్ఎస్ పాఠశాల, నిర్మల హృదయ పాఠశాలలో, ముభరక్ నగర్ తదితర చోట్ల పోలింగ్ బూత్‌లలో ఉదయం నుంచి సందడి నెలకొన్నది.
కొత్త ఓటర్లు తమ ఓటు వేసిన తరువాత సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేసిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు గురువారం సైతం అదే ఒరవడి కొనసాగించారు.
పట్టభద్రులు,ఉపాధ్యాయులు, పట్టభద్ర గృహిణులు, యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు.
