ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంచనాలకు మించి నమోదు అయింది గతంలో కన్న 11 శాతం ఎక్కువగా నమోదు కావడం ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా పెరిగిన పోలింగ్ ఎవరకి అనుకూలంగా సాగిందనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.
మూడు జాతీయ పార్టీల అభ్యర్థుల మద్యే ఈ ఎన్నిక హోరాహోరి గా సాగిందని సమాచారం. ఆయా సమీకరణల అంచనాలతో గెలుపు తమదేనని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కానీ ఎవ్వరికి అంచనాలకు అందకుండా బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ ఈ ఎన్నికల్లో దూసుకొచ్చారు ద్వితీయ ప్రాధాన్యత వోట్లు ఎక్కువగా ఆయనకే పోల్ అయినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా కొత్తగా వోటర్లుగా నమోదు అయినా పట్టబద్రులు ఈసారి పోలింగ్ కేంద్రలకు బారులు తీరారు.
2019 లో 59.03 శాతం పోలింగ్ నమోదు అయితే ఈసారి ఏకంగా 70.42 శాతం నమోదు కావడం ఎన్నికల నిర్వహణ అధికారులనే నివ్వెరపర్చింది.ఈ నెల 3 న కరీం నగర్ లో వోట్ల లెక్కింపు జరుగనుంది. 2019 లో కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత వోట్లతో నే ఘన విజయం సాధించింది.
ఈసారిఅధికారంలో ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ స్థానం గెలవడఁ కాంగ్రెస్ కు నల్లేరు మీద నడకేనని భావించారు. విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ తన అభ్యర్థి ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ నియోజకవర్గం కు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధి ఉంది.
కానీ నరేందర్ రెడ్డి కేవలం కరీంనగర్ కే పరిమితం అయ్యారు. జిల్లానేతలతో కనీసం మమేకం కాలేక పోయారు ఎమ్మెల్యేలు ఇతర ఒకరిద్దరు ముఖ్య నేతలతోనే టచ్ లో ఉన్నారు.సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడం అనివార్యంగా భావించిన కాంగ్రెస్ పార్టీ అన్ని అస్రాలను సంధించింది చివరికి సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయనే ఎన్నికల ప్రచారం కు వచ్చారు.
అదికారంలోకి వచ్చి ఏడాది తరవాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక లో గెలవక పొతే ప్రభుత్వ ప్రతిష్ట మసక బారే ప్రమాదం వుంది. మరో వైపు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి లో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాలో ఎంపీ లున్న బీజేపీ ఈసారి ఈ స్థానం ఎలాగైనా కాంగ్రెస్ నుంచి లగేయాలని గట్టిగానే ప్లాన్ చేసింది. కానీ అభ్యర్థి విషయంలో నే ఎంపీల అభిప్రాయాలను పక్కకు పెట్టేసి అంజి రెడ్డి ని ఖరారు చేసింది.
కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో మాత్రం దూసుకెళ్లారు. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే లను నేరుగా అధిష్ఠానమే సమన్వయం చేసింది. కానీ వారు ఆశించిన మేరకు క్రియాశీలంగా పనిచేయలేదనే వాదన పార్టీ వర్గాలలో బలంగా ఉంది.
మరో వైపు కాంగ్రెస్ టికెట్ కోసం చివరి దాక యత్నించిన ప్రసన్న హరికృష్ణ గౌడ్ బీఎస్పీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు కానీ ఆయన అనూహ్యంగా బిసి అజెండ్ తో చాప కింద నీరులా ప్రచారం సాగించారు.
కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో బి ఆర్ యస్ క్యాడర్ సైతం అనుకూలంగా పని చేశారు. అదే హరికృష్ణ కు బాగా కలిసి వచ్చింది.
