HomeCRIMEఆస్తి పన్ను బకాయిలపై కదలిన యంత్రాంగం .బకాయి చెల్లించని రెండు దుకాణాలు సీజ్‌

ఆస్తి పన్ను బకాయిలపై కదలిన యంత్రాంగం .బకాయి చెల్లించని రెండు దుకాణాలు సీజ్‌

నగరపాలక సంస్థకు చెందిన దుకాణాల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారిపై ఎట్టకేలకు కార్పొరేషన్‌ కార్యాలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.బకాయిలు చెల్లించని కారణంగా నిజామాబాద్ పట్టణంలోని నాలుగు షాపులను బల్దియా అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.

ఆస్తిపన్ను వసూళ్ల కోసం కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నగరంలోని వినాయక్ నగర్ లోని దుకాణాలు తిరుగుతూ పెండింగ్ బకాయిలను వసూలు చేశారు. పెండింగ్ లో ఉన్న రూ 6.18 లక్షలు బకాయిలు చెల్లించని అరుణ్ ఐక్రీం, రూ 30 వేల రూపాయల బకాయిలు చెల్లించలని యదగిరిబాగ్ షాపులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

అదే విధంగా ఎల్ జి షోరూం రూ 2 లక్షలు, ఐడిఎఫ్ సి బ్యాంక్ వారు రూ 4 లక్షలు,విశాల్ మార్ట్ రూ 4 లక్షల బకాయిలు చెల్లించాలని హెచ్చరించారు.

అలాగే ఇతర వ్యాపారులను సకాలంలో బకాయిలను చెల్లించి బల్దియా అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments