అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.వివరాల్లోకి వెళ్లితే.. టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆద్వర్యంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అనిస నగర్ చర్చి వెనక ఓ గోదాములో 2.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వాటి విలువ సుమారు 80,000 ఉంటుందని తెలిపారు.అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకొని తదుపరి చర్యలు నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్ అప్పగించినట్లు పేర్కొన్నారు.
