అధికారంలో వచ్చిన ఏడాది కాలం పూర్తీ చేసుకున్నకాంగ్రెస్ పార్టీతామది ప్రజాపాలన అంటూ సంబర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు ఝలక్ ఇచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు ఆ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగించాయి.
నేతల మధ్య సమన్వయ లోపాలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫై తీవ్ర ప్రభావమే చూపింది. ముఖ్యంగా పట్టబద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోవడం లో నేతల వైఫల్యాలకు పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది.
గతంలో తెరాస ప్రభుత్వ హయాంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న ఆ పార్టీ ఈసారి అధికారంలో ఉండి కూడా సిట్టింగ్ స్థానంనిలబెట్టుకోలేక పోయింది.అందులోనూ గతంలో కనీసం డిపాజిట్ కూడా దక్కిచుకొని బీజేపీ ఈసారి ఏకంగా ఘన విజయం సాధించడం అధికార పార్టీకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
పట్టబద్రుల నియోజకవర్గ పరిధి లో నాల్గు ఉమ్మడి జిల్లాలున్నాయి. ఒక్క కరీంనగర్ నగర్ మినహా మిగితా ఏ జిల్లాలోనూ ఆపార్టీ కనీస ప్రభావం చూపలేక పోయింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ సొంత జిల్లాలోనే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం వోట్లు సాధించలేక పోయిందనే చర్చ ఉంది.ఆయన రెండు రోజులు ఇక్కడే మకాం వేసి మంత్రాంగం నడిపారు సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లాకు వచ్చి ప్రచార సభ లో పాల్గొన్నారు.
కానీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మాత్రం ఒక్కసారి కూడా జిల్లాకు ఎన్నికల ప్రచారం చేయడానికి జిల్లాకు రాలేక పోయారు కేవలం ఎమ్మెల్యే లు నియోజకవర్గ ఇంచార్జ్ లతో టచ్ లో వుంటూ కాలక్షేపం చేశారు. కింది స్థాయిలో పనిచేసే వారితో ఆయన కుసంబంధాలు లేకుండ పోయాయి.
ఉమ్మడి జిల్లాలో ఆపార్టీకి చెందిన నాలుగు శాసన సభ్యులున్నారు మరొకరు బిఆర్ యస్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ లోకి వచ్చారు అయినప్పటికీ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన మేరకు వోట్లు రాబట్టలేక పోయింది.సుమారు 23 వేల వోట్లు జిల్లాలో పోల్ అయ్యాయి.
అందులో తమకు 17 నుంచి 16 వేల వోట్లు వచ్చాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సరే ఈ లెక్కలకు అధికారికం కాక పోయినప్పటికీ కౌంటింగ్ ఏజెంట్ లు ఇచ్చిన నివేదికల ఆధారంగా బీజేపీ పెద్దలు అంచనాగా చెప్తున్నారు జస్ట్ ఇద్దరే ఎమ్మెల్యే లున్న బీజేపీ కి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ గా వోట్లు కొల్ల గొట్టడం అధికార పార్టీకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
అందులోనూ తమ సిట్టింగ్ స్థానంలో బీజేపీ వ్యూహాత్మకంగా వోట్లు సాధించడం కాంగ్రెస్ నేతల్లో కలవరం తెప్పించింది. గత ఎన్నికల్లో నామాత్రంగా వోట్లు సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా ఘనవిజయం సాధించడం అధికార పార్టీ ని ఆత్మ రక్షణ లో పడేసింది.
గత లోకసభ ఎన్నికలోనూ సానుకూల ఫలితాలు సాధించలేక పోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చేతులు ఎత్తేయడం క్యాడర్ ఆందోళనకు గురిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీ మంచి ఊపు ఇచ్చినట్లు అయింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కి ప్రమాద ఘంటికలు మోగించినట్లు అయింది. ఎమ్మెల్యే లుఎవరికి వారే యమునా తీరున్నటుగా వ్యవహరించడం వల్లే ఆయా సెగ్మెంట్ లలో ప్రతికూల ఫలితాలు వచ్చాయని చర్చ విస్తృతంగా సాగుతుంది.
నిజానికి నరేందర్ రెడ్డి ఎన్నికల వ్యయం విషయంలో ఏ మాత్రం వెనుకాడలేదు ఎమ్మెల్యే లు నియోజకవర్గ ఇంచార్జి డిమాండ్ మేరకు ఆర్థిక అవసరాలు నెరవేర్చినట్లు సమాచారం. కానీ వోటర్ల ను మోటివేట్ చేసి వోట్లు వేయించడంలో మాత్రం కిందస్థాయిల్ క్రియాశీలంగా ఉండే క్యాడర్ చేతులు ఎత్తేసారు.
ఎమ్మెల్యే ఇంచార్జి లను సమన్వయం చేసే వ్యవస్థ లేకుండా పోయింది అందుకే వారంతా కిందిస్థాయిలో గట్టిగా పని జరగలేదు.
అందుకు తగ్గట్టుగా నే మూల్యం చెల్లించుకున్నారు. పార్టీ అధికారం లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడకలాగా వుండాలి కానీ అందుకు తగ్గట్టు కార్యాచరణ కూడా వుండాలి కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నికను గాలి కి వదిలేయడం వల్లే ప్రతికూల ఫలితాలు అనివార్యం అయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ను ఇలాంటి వైఖరి తో వుంటే ఆ ఫలితాలు కూడా ఇలాగే వుంటాయి.
