రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ఎల్లమ్మ గుట్ట కు చెందిన బిందెలు ప్రతాప్ సింగ్(60).బుదవారం ఉదయం నిజామాబాద్ డిచ్ పల్లి మధ్యలోని పుల్లాంగ్ వాగు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ హరి కృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.
