HomeTelanganaNizamabadసుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి.. దిగజారుడు మాటలతో ఎంపీ పదవిని అపహాస్యం చేస్తున్న ఫేక్...

సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి.. దిగజారుడు మాటలతో ఎంపీ పదవిని అపహాస్యం చేస్తున్న ఫేక్ డిగ్రీ అరవింద్ ..ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్

అభివృద్ధి అంటేనే సుదర్శన్ రెడ్డి అని అలాంటి నేత మీద ఎంపీ అర్వింద్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని యన్ యస్ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణురాజు అన్నారుగురువారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో జరిగిన పత్రికా సమావేశం లో వేణు రాజ్ గారు మాట్లాడుతూ జవహర్ నవోదయ మంజూరు విషయమై మా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి మరియు భూపతి రెడ్డి గారిపై దిగజారుడు మాటలు మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్లమెంట్ సభ్యుడు అనే విషయం మర్చిపోయి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పెద్దలను ఎలాగా గౌరవించాలి తెలియని సంస్కారహీనుడు ఎంపీ అరవింద్ అన్నారు

ఎంపీ అరవింద్ లాగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి ఫేక్ ఫేక్ డిగ్రీలతో గెలిచే నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కాదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రదాతగా పేరు సంపాదించుకున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారని ఆయన అన్నారు.

ఎంపీ అరవింద్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సుదర్శన్ రెడ్డి హయాంలో జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ తెలంగాణ విశ్వవిద్యాలయం లాంటి వాటిని జిల్లాకు మంజూరు చేయించారని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాల ప్రాజెక్టులను తీసుకురావడం జరిగిందని, మీరు మాత్రం ఎంపీగా గెలిచి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ తోపాటు మాధవ నగర్ బ్రిడ్జి మరియు మామిడిపల్లి బ్రిడ్జిలను ఏళ్ల తరబడిగా పెండింగ్ లో పెట్టారని కొన్ని ఏళ్లుగా వాటి పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఎంపీ అరవింద్ చేతగానితనానికి నిదర్శనం అని ఆయన అన్నారు.

పసుపు బోర్డు తెస్తానని చెప్పి తూతూ మంత్రంగా పేపర్లపై బోర్డును తెచ్చి ప్రజలను మాయ చేసిన మోసగానివి నువ్వైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా జిల్లాలో పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన చరిత్ర సుదర్శన్ రెడ్డి గారిని ఆయన అన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఇతర ప్రాజెక్టులకు అడ్డు పుల్ల వేస్తున్నారని ప్రజలు గ్రహించడంతో దిక్కుతోచని స్థితిలో బిజెపి రాష్ట్ర నాయకత్వం జిల్లాలో ఆయా ఎమ్మెల్యేల పై విష ప్రచారం చేయాలని వారి ఎంపీలను ఎమ్మెల్యేలను నాయకులను ఆదేశించిందని అందులో భాగంగానే ఎంపీ అరవింద్ గారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి మరియు భూపతి రెడ్డి గారిని టార్గెట్ చేశారని జవహర్ నవోదయ జిల్లాకు మంజూరు చేసినట్టే చేసి దానిని కాంగ్రెస్ నాయకులు కావాలని దానిని అడ్డుకుంటున్నారని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని కానీ అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరియు భూపతి రెడ్డి గారు కాదని అలాంటి నీచ సంస్కృతి కిషన్ రెడ్డిది నీ బిజెపి పార్టీ ది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే తప్పుడు ఆలోచనలు తప్ప నిజంగా నీకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే ముందు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి వాటిని పూర్తి చేయాలని, అలాగే తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించినప్పుడు అధిక నిధులు కేటాయించాలని మీ పార్టీపై ఒత్తిడి చేయాలని అంతేతప్ప మీకు అభివృద్ధి చేయడం చేతకాక కాంగ్రెస్ పార్టీ నేతలపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరందీప్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ నాయకులు శివ. సాయికిరణ్, హరీష్, నరందీప్, సందీప్ ,కౌశిక్, అభిలాష్, రాహుల్, జాన్, రేవంత్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments