బీజేపీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎంపీ అర్వింద్ చాలాకాలం తర్వాత సహజ ధోరణి లో సుదర్శన్ రెడ్డి మీద విరుచుక పడ్డారు పదునైన పదజాలం తో ఆయన్ని కడిగి పడేసారు.
ఆ వెంటనే నిజామాబాద్ జగిత్యాల్ జిల్లాలో బీజేపీ శ్రేణులు చెలరేగి పోయాయి. దాదాపు 11 చోట్ల దిష్టి బొమ్మలు కాల్చేశారు. సోషియల్ మీడియా వేదికల్లో సుదర్శన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ శ్రేణులు దూషణలకు దిగాయి.
మరో వైపు జిల్లా పార్టీలో పాలన వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న సుదర్శన్ రెడ్డి వైపు నుంచి కాంగ్రెస్ పెద్దగా కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేసింది.
సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పటిదాకా అర్వింద్ ఆరోపణల కు కౌంటర్ ఇవ్వలేక పోయారు. గతంలో జిల్లాలో రాజకీయ వివాదాలు బీజేపీ వర్సెస్ బిఆర్ యస్ అన్నట్లుగా వుండేవి. కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం సర్వత్ర ఆసక్తి గా మారింది.
జవహర్ నవోదయ విద్యాలయఏర్పాటు వ్యవహారమే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎంపీ అర్వింద్ ల మధ్య చిచ్చు రేపింది.నిజానికి అసెంబ్లీ ఎన్నికల దాక అర్వింద్ జిల్లాలో గులాబీ నేతలనే టార్గెట్ చేస్తూ వచ్చారు.
కాంగ్రెస్ నేతల జోలికి వెళ్ళేది కాదు అందులోనూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విషయంలో అర్వింద్ కొంత సానుకూలత తో మాట్లాడేవారు. దీనితో ఇద్దరు మధ్య రాజకీయ అవగాహన వుందనే ప్రచారానికి తెరలేసింది.
కానీ లోకసభ ఎన్నికల్లో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం సాగింది. కానీ సుదర్శన్ రెడ్డి విషయంలో ఆచితూచే మాట్లాడుతూ వచ్చారు.కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలగాంణ కు ఆరు జవహర్ నవోదయ విద్యా సంస్థ లను మంజూరీ చేస్తే అర్వింద్ తన లోకసభ ఫరీది లో రెండు మంజూరి చేయించుకున్నారు అందులో ఒకటి జగిత్యాల్ మరొకటి నిజామాబాద్ జిల్లాకు ఇచ్చారు.
ఆయా జిల్లాలో ఎంపీ అర్వింద్ ప్రతిపాదించిన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించేలా కలెక్టర్ లకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లకు అందుబాటులో ఉండేలా జక్రాన్పల్లి మండలం కలీగోట్ వద్ద ప్రభుత్వం భూమి అందుబాటులోవుండడంతోఅక్కడే ఏర్పాటు చెయ్యాలని అర్వింద్ కలెక్టర్ ను కోరారు ఆ ప్రాంతంలో నవోదయ కు అవసరం అయిన 30 ఎకరాల ప్రభుత్వ భూమి ని గుర్తించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు దీనితో స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి తో స్వయంగా మాట్లాడి ఆయన్ను కూడా ఒప్పించారు.
ఈ మేరకు అర్వింద్ ఆమధ్య సీఎం ను కలసి అక్కడే ప్రభుత్వ భూమి కేటాయించాలని లిఖిత పూర్వకంగా కోరారు.మరో వైపు కలెక్టర్ సైతం ప్రభుత్వానికి కలిగోట్ వద్ద అందుబాటులో ఉన్న 30 ఎకరాలభూమి నవోదయ కోసం కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు.
కానీ నవోదయ సంస్థ జిల్లాకు మంజూరి లో జాప్యం జరగడంతో అర్వింద్ కేంద్ర అధికారులను వాకబు చేశారు. నవోదయ ఏర్పాటు కు కనీసం 30 ఎకరాలు అవసరమని కానీ నిజామాబాద్ జిల్లాలో 8 ఎకరాలు ఇచ్చారని అందుకే సాంకేతిక కారణాలతో నిలిచి పోయిందని స్పష్టత ఇచ్చారు దీనితో కలెక్టర్ ను అరా తీయడం తో ఎహే అసలు నవోదయ కలిగోట్ లో కాకుండా బోధన్ లో అదికూడా ఎన్ యస్ ఎఫ్ కు చెందిన జస్ట్ ఎనిమిది ఎకరాల భూమే ఇస్తామని ప్రతిపాదించిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదంతా హైదారాబాద్ నుంచి ముఖ్య కార్యదర్శి పేషీ నుంచి జరిగిందని తేలింది.ఇంకేముంది అసలే ఆయన అర్వింద్ అంతే ఒంటి కాలు మీద లేచాడు సుదర్శన్ రెడ్డి గట్టిగా అరుసుకున్నాడు. చివరికి సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా వదల కుండా గట్టిగా ఇచ్చేసాడు.
అర్వింద్ కు మద్దతు గా రెండు జిల్లాలో ను బీజేపీ శ్రేణులు రోడ్లెక్కారు చేయాల్సినంత రచ్చ చేసారు.గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ నేతలు బేలా చూపులు చూసారు. ముఖ్యనేతలెవ్వరూ పెదవి విప్పలేదు.
ఎదో ఒకరిద్దరు యువనేతలు మాట్లాడారు. అసలు సుదర్శన్ రెడ్డి కూడా ఇంకా మౌనంగా నే ఉన్నారు ఆయన వైపు నుంచి ఇంకా క్లారిటీ రాకపోవడం అధికార పార్టీలో చర్చనీయాంశం అయింది ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆయన్ను ఇరుకుల్లో పెట్టెలాగా ఫ్యాక్టరీ భూములు నవోదయ కు ఎలా కట్టబెడుతున్నారని అర్వింద్ ఆరోపణలు బలంగా ప్రజల్లో వెళ్లాయి.
సో సుదర్శన్ రెడ్డి వైపు నుంచి ఎవ్వరు ఈ కోణం లో కౌంటర్ ఇవ్వలేదు
