ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తేసిన మరుసటి రోజే ఎట్టకేలకు ప్రభుత్వం నిజామాబాద్ కు కొత్త పోలీసు కమిషనర్ ను నియమించింది. సాయి చైతన్య సీపీ గా నియామకం అయ్యారు. ఆయన హైదారాబాద్ లో నార్కోటిక్ విభాగంలో డీసీపీ గా పనిచేస్తున్నారు.
గతంలో సౌత్ జోన్ డీసీపీ గా టాస్క్ ఫోర్స్ లో హైదారాబాద్ ఎక్కువగా పనిచేసారు విధి నిర్వహణలో అత్యంత కఠినంగా వుంటారనే ముద్ర ఉంది.
ఆయనది ఏపీ లోని నెల్లూరు జిల్లా ఐఐటీ పూర్తీ చేసిన ఆయన 2016 బ్యాచ్ ఐపీఎస్ గా ఉన్నారు.అలాగే కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ సైతం బదిలీ అయ్యారు ఆమె స్థానంలో యాదాద్రి డీసీపీ గా ఉన్న రాజేష్ చంద్ర నియామకం అయ్యారు ఆమె ను ఇంటిలిజెన్స్ విభాగంలో ఎస్పీ గా నియామకం అయ్యారు.
