సాలురా మండలం హున్సా గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న పిడిగుద్దులాట కు పోలీసులు ఈసారి బ్రేక్ వేశారు .కానీ ఈ సంవత్సరం ఆడద్దు అంటూ గ్రామస్తులకు బోధన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఆంక్షలను ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.పోలీసుల ఆంక్షలను గ్రామస్థులు ఖాతరు చేస్తారా లేదా అనేది ఉత్కంఠ గా మారింది.హోలీ పండుగ రోజు పిడిగుడ్డులాట ఆడితేనే ఆ సంవత్సరం మొత్తం గ్రామస్తులు,పశు పక్షాదులు సుఖ సంతోషాలతో పాటు సంక్షేమంగా సమృద్ధిగా ఉంటారని గ్రామస్తుల నమ్మకం. దాదాపు ఆరు దశాబ్దాలుగాసాగుతుంది.
ఈ ఏడాది పోలీసులు అడ్డు రావడం పట్ల గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.పిడిగుద్దులాటను తిలకించడానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.
ఈ అట లో వందలాది మంది కి గాయాలు అవుతాయి.శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం వుండడంతో పోలీసులు ఈ ఆనవాయితీ ని అడ్డుకోవడానికి సిద్ధం అవుతున్నారు
