నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి ని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం కు చెందిన ఓ వ్యక్తి గంజాయి ఫ్యాకెట్లు అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం మేరకు నాందేడ్ కు చెందిన మరొకరి ని అదుపులో కి తీసుకున్నారు.
హోను శెట్టి రవి , నాందేడ్ కు చెందిన సయ్యద్ జిలానీ ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్ బైకు పై అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులని చూసి పారిపోతుండగా పోలీసు సిబ్బంది వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద 390 గ్రాముల గంజాయి లభించగా అట్టి గంజాయిని సీజ్ చేసి వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు .
అట్టి వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి గంజాయికీ అలవాటు పడి నాందేడ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి అధిక డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నిజామాబాదు పరిసర ప్రాంత గ్రామాలలో అమ్ముతూ ఉంటారని గంజాయిని అమ్మిన లేదా కొన్న వారిపై కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్ రూరల్ సీఐ గారు పత్రిక ప్రకటనలో తెలిపారు.
