పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు
..జిల్లావ్యాప్తంగా జరుగుతున్నా డ్రగ్స్, గంజాయి, మారకద్రవ్యల పైన ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని దన్ పాల్ కోరారు మారకద్రవ్యల పైన పోలీస్ శాఖ కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనినగరంలో వరుస దొంగతనాలు చైన్ స్నాచింగ్, ఆటో, బైక్ దొంగతనాలను అరికట్టాలన్నారు .
ఫుట్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రతేక ద్రుష్టి పెట్టాలని కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
లా & ఆర్డర్ కాపాడటంలో పోలీస్ శాఖ తీసుకునే ప్రతి అంశంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసారు.
