మృతి చెందిన కానిస్టేబుల్. కామారెడ్డి జిల్లా గాంధారి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్థరాత్రి పెట్రోలింగ్ (గస్తీ )నిర్వహిస్తూ ఇద్దరు కానిస్టేబుల్ లు రోడ్డు పక్కన ఒకచోట నిలిచొని ఉన్న ఇద్దరు పై గాంధారి మండలానికి చెందిన సాయిలు RMP డాక్టర్ కుమారుడు సునిత్ కారు అతివేగంగా కారు డ్రైవింగ్ చేస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు.
TS 9 EA 9495 గల హోండా సిటీ కారు ఢీకొనడంతో రవి కుమార్ వయసు 40, అక్కడికక్కడే మృతి చెందాగా మరొకరు సుభాష్ అనే కానిస్టేబుల్ కి గాయాలు కావడంతో రాత్రి కామారెడ్డి అస్పటల్ కి గాంధారి పోలీస్ లు తరలించారు.
మృతి చెందిన రవికుమార్ కానిస్టేబుల్ స్వగ్రామం తాడ్వాయి మండల్ కరేడ్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా అతనికి ఒక పాప ఒక బాబు ఉన్నారని తెలిసింది.
ఇతను 2007 బ్యాచ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలకు గురి చేస్తున్న వ్యక్తులను కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీస్ లకు వేడుకుంటున్నారు.
