హైదరాబాద్ లో మరో విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు బొల్లారం డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం.. బొల్లారంలోని పీపీఆర్ హాస్పిటల్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ కాంట్రాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తి నుంచి ఏఈ రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి ఏఈని పట్టుకున్నారు.
