కోర్ కమిటీ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రేణిగుంట నాంపల్లి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కోర్ కమిటీలో తీసుకున్నందుకు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను రెట్టింపు ఉత్సాహంతో చేస్తానని తెలిపారు
