డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణవైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటనా నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం, ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం కారణంగానే మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఘటన నిజామాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోచంపాడకు చెందిన సుదర్శన్ (70) అనారోగ్యంతో గత నెల 30న ప్రగతి ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు అధిక మోతాదులో ఇంజక్షన్ ఇవ్వడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. చికిత్స సరిగా అందడం లేదని భావించిన కుటుంబ సభ్యులు ఈ నెల 2న ఆయనను హోప్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సుదర్శన్ మృతి చెందారు. ప్రగతి ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే సుదర్శన్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీంతో మృతదేహాన్ని ప్రగతి ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
