HomeTelanganaHyderabadనల్ల డ్రెస్ లతో బిఆర్ యస్ సభ్యులు ...ఆదుకున్న పోలీసులు .....బైఠాయించినిరసన ......అరెస్ట్ చేసి తరలింపు...

నల్ల డ్రెస్ లతో బిఆర్ యస్ సభ్యులు …ఆదుకున్న పోలీసులు …..బైఠాయించినిరసన ……అరెస్ట్ చేసి తరలింపు ………చీర లాగారంటూ విలపించిన సునీతా రెడ్డి …మొదటి రోజు అసెంబ్లీ సెషన్ హాట్ హాట్

మొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు హీటెక్కించాయి. బ్లాక్ డ్రెస్ లో సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను మెయిన్ గెట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తమను అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము టీషర్ట్ లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నామని, వాటిని విప్పేసి లోపలికి వెళ్లాలా అని ప్రశ్నించారు.

ప్రజా స్వామ్యంలో ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ప్రభుత్వ హామీలను నిలదీయొద్దా అని మండిపడ్డారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ విధానాలను తప్పు బడుతూ బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు అసెంబ్లీలోకి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ టీ షర్టులు విప్పేసి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

/// కంట తడిపెట్టిన సునీతా ////

అసెంబ్లీ లోపలికి వెళ్తున్న బిఆర్ యస్ ఎమ్మెల్యే లను పోలీసులు అడ్డగించారు ఈ క్రమంలో నే తోపులాట తలెత్తింది.ఓ అధికారి తన చీర ను లాగారంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి కంట తడి పెట్టారు మరో ఎమ్మెల్యే సబితా అక్కడున్న అధికారులను తీవ్ర స్థాయిలో నిలదీశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments