గత రెండున్నరేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న షబ్బీర్ అలీ రాబోయే రోజుల్లో కామారెడ్డి కే ఎక్కువగా ప్రాధాన్య త ఇవ్వాలని భావిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇందుకు సానుకూలత వ్యక్తం చేసారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
కామారెడ్డి నియోజకవర్గం లో ఇటీవల తలెత్తిన అవాంఛనీయ పరిమాణాలనేపథ్యంలో షబ్బీర్ ఇక కామారెడ్డి కేంద్రంగానే రాజకీయ చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అవసరం అయితే నిజామాబాద్ అర్బన్ ను వదులుకోవడానికి సైతం షబ్బీర్ సిద్ధం అవుతున్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి దూకుడు వైఖరి ఫై ఆయన లోలోప రగిలి పోతున్నారు.
పార్టీలోకి తెచ్చిన తననే టార్గెట్ చేయడాన్ని షబ్బీర్ వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పనిచేయడంతో గుర్తింపు పొందాడు. రేవంత్ తమ్మడు కొండల్ రెడ్డి సైతం చేరదీసాడు.
ఎలాగో షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ వుండడం తో చంద్ర శేఖర్ రెడ్డి ని రాజకీయంగా ప్రోత్సహించారు ఇందులో భాగంగానే అతనికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు.
ఆ పదవి రావడంతో గతంలో షబ్బీర్ అలీ ఏఐసీసీ స్థాయిలో పిర్యాదు చేశారు. కానీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గా ఆయన కామారెడ్డి పట్టు సాధించే పనిలో దూకుడు పెంచాడు.మున్సిపల్ ఎన్నికల్లో ను టికెట్ల కోసం పీసీసీ స్థాయిలో ఒత్తడి చేసి పది మందికి టికెట్లు ఇప్పించాడు. మున్సిపల్ ఎన్నికల తర్వాత షబ్బీర్ కామారెడ్డి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నారు.
చంద్ర శేఖర్ రెడ్డి టార్గెట్ చేసాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడంటూ క్రమశిక్షణ కమిటీ కి ఈడ్చారు ఆతను కూడా షబ్బీర్ అలీ మీద కూడా పిర్యాదు చేసాడు ఇరు పక్షాల పంచాయితీ ఇంకా ఎటూ తేలక ముందే షబ్బీర్ అలీ వాయిస్ తో ఉన్న ఆడియో క్లిప్ తెరమీదికి వచ్చింది అందులోపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.
ప్రస్తావన కూడా ఉండడంతో అనూహ్యంగా షబ్బీర్ అలీ కి షోకాజ్ నోటిస్ జారీ అయింది ఈలోపు చంద్ర శేఖర్ రెడ్డి భార్య మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మీద నీచమైన పోస్టింగ్ లు సోషియల్ మీడియా లో వైరల్ అయ్యాయి ఆమె నేరుగా ఎస్పీ ని కల్సి షబ్బీర్ మీదే పిర్యాదు చేసింది. ఈ పరిణామాలకు ముందే షబ్బీర్ కామారెడ్డి లోనే బలంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చాయి కామారెడ్డి వ్యవహారాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోనని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
తన తమ్ముడు సైతం అలాగే దిశానిర్దేశం చేశారు. దీనితో రాబోయే రోజుల్లో తన మార్క్ రాజకీయం చెయ్యడానికి షబ్బీర్ సిద్ధం అవుతున్నారు తన చెప్పు చేతుల్లో ఉండే అధికారులను ఆయన ఏరీ కోరి పోస్టింగ్ లు చేయించుకున్నారు ఆయన ఎవరిని అడిగినా పోస్టింగ్ ఇవ్వాలని సీఎంవో నుంచే స్పష్టమైన ఆదేశాలు సైతం వెళ్లాయట.
