శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం లో అదనపు ఎస్పీ మృతి చెందాడు . ఉదయం నడక కోసం రోడ్డు దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో నివాసం ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర్బాబ్జీ (50) శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు అని వెళ్లారు. సుమారు అయిదు గంటల ప్రాంతంలో హనుమాన్‌టెంపుల్ సమీపంలో హైవేను దాటుతుండగా.. అబ్దుల్లాపూర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బాబ్జీని బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. . డీజీపీ కార్యాలయంలో డిఎస్పీ గా పనిచేస్తున్న నందీశ్వర్ బాబ్జీ ఇటీవలే అడిషనల్ ఎస్పీగాపదోన్నతిపొందారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజు వెల్లడించారు.
