HomeCRIMEరోడ్డు ప్రమాదం లో అదనపు ఎస్పీ మృతి

రోడ్డు ప్రమాదం లో అదనపు ఎస్పీ మృతి

శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం లో అదనపు ఎస్పీ మృతి చెందాడు . ఉదయం నడక కోసం రోడ్డు దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో నివాసం ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర్​బాబ్జీ (50) శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు అని వెళ్లారు. సుమారు అయిదు గంటల ప్రాంతంలో హనుమాన్​టెంపుల్ సమీపంలో హైవేను దాటుతుండగా.. అబ్దుల్లాపూర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బాబ్జీని బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. . డీజీపీ కార్యాలయంలో డిఎస్పీ గా పనిచేస్తున్న నందీశ్వర్ బాబ్జీ ఇటీవలే అడిషనల్ ఎస్పీగాపదోన్నతిపొందారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments