‘వివాహేతర సంబంధానికి అడ్డం వస్తున్నాడనే నేపం తో ప్రియుడి తో కలిసి భర్త ను హత్య చేసిన భార్య ఉదంతం బీర్కూర్ మండలం దామరంచ శివారులో నాగారం లో జరిగింది.గ్రామానికి చెందిన విట్టల్ దారుణ హత్యకు గురయ్యాడు.భార్య కాశమని అదే గ్రామానికి చెందిన ఒకరి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
భర్త అడ్డు వస్తున్నాడని డబ్బులు ఇచ్చి భర్తను చంపించినట్లు మృతుడి తమ్ముడు సాయిలు పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు .
మృతుడు సోమేశ్వర గ్రామం నుండి నాగారం గ్రామానికి మేన మామ ఇంటికి ఇల్లరికం వెళ్ళాడన అన్నాడు.మృతుని భార్య కాశమని,మరో ఇద్దరి ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .మృతుడి కి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
