HomeCRIMEఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం…

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం…

ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తండ్రి బాసర గోదావరిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చూసి వారిని కాపాడారు. ఈ ఘటన బుదవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..

నిజామాబాద్ నగరంలోని బియిగల్లి కి చెందిన గంగాప్రసాద్ కుటుంబ కలహాలతో తన ఇద్దరు చిన్నారులను తీసుకొని బాసర గోదావరిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ వారిని చూసి కాపాడి మానవత్వం చాటుకున్నారు.

వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను
పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments