నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్,నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసులలో నేరస్థులకు శిక్ష పడేవిధముగా కృషి చేసిన అధికారులను సీపీ సాయి చైతన్య అభినందించారు.
వారిలో పబ్లిక్ ప్రొసీక్యూటర్స్ ఎమ్. రాజా రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ అలాగే బి. వసంత్, అడిషనల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్, బి. రాజేష్ గౌడ్, ఎ. పి. పి. ఓ లను అదేవిధంగా ఆయా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ ఎస్. సతీష్ కుమార్ , సురేష్ కుమార్, ఎస్ఐ బాల్ రెడ్డి,లను కోర్ట్ డ్యూటీలు నిర్వహించే కానిస్టేబుళ్లు నవీపేట్ పీఎస్ కు చెందిన కె. నవీన్ కుమార్, నిజామాబాదు రూరల్ పీఎస్. ఎ. కిరణ్. ముగ్పాల్ పీఎస్ ఎమ్. శ్యామ్ రావ్ అభినందించి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. వివిధ కేసులలో నేరస్థులకు శిక్ష లు పడటానికి ఎంతో కృషి చేసారని, ఇదే స్పూర్తితో మిగితా పోలీస్ స్టేషన్ లలో గల కోర్ట్ సిబ్బంది కృషి చేయాలని తెలియచేసారు.
ఈ సందర్బంగా ట్రైనింగ్ సాయి కిరణ్ పత్తిపాక, అదనపు పోలీస్ కమీషనర్ ( స్పెషల్ బ్రాంచ్ ) శ్రీనివాస్ రావ్ పాల్గొన్నారు.
