HomeCRIMEవిద్యార్థినులపై అసభ్య ప్రవర్తన – ఇద్దరు ఉపాధ్యాయులపై ఫోక్సో కేసు, రిమాండ్‌కు తరలింపు

విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన – ఇద్దరు ఉపాధ్యాయులపై ఫోక్సో కేసు, రిమాండ్‌కు తరలింపు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొంతమంది విద్యార్థినులపై ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

తమ పట్ల ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినులు నేరుగా షీ టీమ్ కు ఫోన్ చేసి సమాచారమిచ్చారుదీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసి రెండు రోజుల క్రితమే రిమాండుకు తరలించినట్టుగా సమాచారం.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గత శనివారం అదే మండలంలోని ఓ పిఈటీ ఉపాద్యాయుడిపై కూడా ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించగా ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు.

అయితే ఆ ఘటన మరువక ముందే మరొక ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments