ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గార్లపై కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు పల్నాటి కార్తీక్ రెండొవ పట్టణ పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది
ఈ సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు పల్నాటి కార్తీక్ మాట్లాడుతు కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, కుంబకోణలతో కాలం గడిసిందని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చార్జ్‌షీట్‌లో చేర్చడంతో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రధానిపై, కిషన్ రెడ్డి పై అశ్లీల వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
కుంబకోణలకు మరో పేరే కాంగ్రెస్ అని అలాంటి కాంగ్రెస్ నాయకులు చేసిన కుంబకోణలు ఒక్కొక్కటి బయటపడుతుంటే తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు బిజెపి అగ్రనాయకులను దూషిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ తప్పు చేయకుంటే భయం ఎందుకని అన్నారు,నిజాయితీపరులైతే ఈడికి సహకరించాలని సూచించారుకాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను గల్లీలో తిరగనివ్వమని ప్రజలే ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే గుడ్డలు ఊడతీసి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.
పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి అంజనీ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
