HomeTelanganaNizamabadబాపూజీ వాచనాలయం అభివృద్ధికి రూ. 40 లక్షల విరాళం

బాపూజీ వాచనాలయం అభివృద్ధికి రూ. 40 లక్షల విరాళం

బాపూజీ వాచనాలయం నూతన భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు భారీగా నిధులు సమకూర్చారు. ఇందులో భాగంగా టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్‌ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉదారత చాటుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు వారిని హైదరాబాద్‌లో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం వాచనాలయం భవన నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేసేందుకు మహేష్‌ కుమార్ గౌడ్ అంగీకరించారు.

అదేవిధంగా, అంతకుముందే అనిల్ కుమార్ యాదవ్ తన ఎంపి నిధుల నుంచి రూ. 25 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాచనాలయం నిర్మాణానికి మొత్తం రూ. 40 లక్షల నిధులు సమకూరడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

తమ అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించి, నిధులు అందజేసినందుకు మహేష్‌ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments