HomeTelanganaNizamabadఓలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఓలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు ఎదగాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం 2024-2025 బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ *అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు* పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండటం మన జిల్లాకు గర్వకారణం అన్నారు.

గిరిరాజా కళాశాల విద్యార్థులు క్రీడాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం తో పాటు ఓలంపిక్స్ లో మెడల్స్ సాధించే విధంగా లక్ష్యం పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.యువత మారకద్రవ్యల, మత్తు పదార్ధాలకు అలవాటు పడకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగ ఉండటానికి క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు.

ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో గ్రామస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సాహించేల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మౌలిక సౌకర్యల కల్పనతో పాటు కోచ్ లను నియమించాలని సూచించారు.ఇందూర్ జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం విషయం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేల కృషి చేస్తానని తెలియజేసారు.

గిరిరాజా కళాశాల పూర్వవిద్యార్థిగా, అర్బన్ ఎమ్మెల్యేగా కళాశాల అభివృద్ధికి తగిన నిధులు ప్రభుత్వం నుండి వచ్చేల కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి విషయంలో అవసరమైతే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులతో కలిసి పని చేస్తాం అన్నారు.

అనంతరం వివిధ క్రీడా రంగాలలో విజేతలుగా నిలిచినా క్రీడాకారులకు మెడల్స్, బహుమతులను ఎమ్మెల్యే గారు క్రీడాకారులకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పీ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగా రత్నం,PD డా. బాలమణి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments