HomeCRIMEదొంగతనాలకు పాల్పడుతున్న మహిళా అరెస్ట్..

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా అరెస్ట్..

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

ఈ నెల 17న బింగి సరేష్ అనే బాధితుడు తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 7గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8వేల నగదు దొంగిలించారని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా అతని ఇంటి పక్క ఇంటిలో నివాసం ఉండే మహిళ అయినా చాకలి జ్యోతి పై అనుమానం వ్యక్తం చేయగా అట్టి మహిళను మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేశారు.

ఆమె ఫిర్యాదు దారి ఇంట్లో దొంగతనం చేసిన విషయం ఒప్పుకున్నది. అంతేకాకుండా సుమారు నెల రోజుల క్రితం వారి ఇంటి పక్క వారి ఇంటి పక్కనే ఉండే కటికే శారద ఇంట్లో కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది.

రెండు దొంగతనాలకు సంబంధించి ఐదు తులాల ఏడు గ్రాముల బంగారం, 3000 రూపాయలు మహిళా నేరస్థురాలు ఇంటిలో నుండి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments