ఇటీవల వివాహం చేసుకున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ కుటుంబ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గత నెల 30న జరిగిన వివాహానికి అనారోగ్య కారణాలతో సుదర్శన్‌రెడ్డి హాజరు కాలేకపోయారు.
దీంతో వేణురాజ్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను సుదర్శన్‌రెడ్డి ఆశీర్వదించి, వేణురాజ్‌కు బంగారు ఉంగరాన్ని బహూకరించారు. కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
