HomeTelanganaNizamabadటీఎన్‌జీవోఎస్‌ కృషితో 8 మందికి పదోన్నతులు

టీఎన్‌జీవోఎస్‌ కృషితో 8 మందికి పదోన్నతులు

టీఎన్‌జీవోఎస్‌ యూనియన్‌ నాయకుల కృషితో పాఠశాల విద్యాశాఖలో ఒక రికార్డు అసిస్టెంట్‌, ఏడుగురు ఆఫీస్‌ సబార్డినేట్‌లకు జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో పదోన్నతులు మంజూరయ్యాయి. మరో ముగ్గురు ఆఫీస్‌ సబార్డినేట్‌లను జెఆర్‌ఏఎస్ఎస్టీ కేడర్‌లో విలీనం చేశారు.

టీఎన్‌జీవోఎస్‌ యూనియన్‌ కేంద్ర అధ్యక్షుడు మర్రం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌.ఎం. హుస్సేని ముజీబ్‌, హైదరాబాద్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు కె.ఆర్‌. రాజ్‌కుమార్‌, హైదరాబాద్‌ డీఈఓ యాదయ్య కృషితో ఈ ప్రక్రియ పూర్తయింది.

రికార్డు అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది డీఈఓ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ అశోక్‌ జీబీహెచ్‌ఎస్‌ సుల్తాన్‌షాహి, ప్రేమ్‌ జీబీహెచ్‌ఎస్‌ బోవెన్‌పల్లి, మనన్‌ జీబీహెచ్‌ఎస్‌ ఉర్దూ షరీఫ్‌, ఇమ్రాన్‌ జీహెచ్‌ఎస్‌ గోష్‌కట్‌, నిలోఫర్‌ సుల్తానా జీబీహెచ్‌ఎస్‌ చాదర్‌ఘాట్‌, ఝాన్సీ ఐఏఎస్ఈ కురుక్కు, చంద్రశేఖర్‌గౌడ్‌ జీబీహెచ్‌ఎస్‌ సీపీఎల్‌ అంబర్‌పేటలో జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియమితులయ్యారు.

అలాగే జ్యోతి, రోహిత్‌, స్వాతిలను జెఆర్‌ఏఎస్ఎస్టీ కేడర్‌లో విలీనం చేశారు. ఈ ఫైల్‌ ప్రక్రియను ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ జి.రాజ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ఏఎస్ఎస్టీ షోయిల్‌ అహ్మద్‌, ఫయాజ్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా టీఎన్‌జీవోఎస్‌ యూనియన్‌ నాయకులు మర్రం జగదీశ్వర్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

కార్యక్రమంలో జాంగిర్‌భాయ్‌, కె.ఆర్‌. రాజ్‌కుమార్‌, ఫెర్రస్‌ అహ్మద్‌, మై రవి, మోయిన్‌ జైద్రియా, రమేష్‌, సుదర్శన్‌, అరుణజ్యోతి, శివ, అకీల్‌, శివరాజ్‌, రమాకాంత్‌, వెంకటేష్‌, సతీష్‌, జిమీర్జా, రాకేష్‌, రాజేష్‌, శివనార్య గుప్తా, లక్ష్మణ్‌, అశోక్‌, ప్రేమ్‌, మనన్‌, ఇమ్రాన్‌, నిలోఫర్‌ సుల్తానా, ఝాన్సీ, చంద్రశేఖర్‌గౌడ్‌, రోహిత్‌, శ్రీకాంత్‌, స్వాతి, రవి, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments