నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందల్వాయి ఎస్ఐ గా పనిచేసిన మనోజ్ కుమార్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. వీఆర్ లో ఉన్న సందీప్ ను ఇందల్వాయి ఎస్ఐ గా బదిలీ చేశారు.
జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ తిరుపతిని వీఆర్ కు అటాచ్ చేశారు.సీసీఎస్ లో ఉన్న రమేశ్ ను ఆర్మూర్ పీఎస్ ఎస్సై-1గా నియమించారు. ఆర్మూర్ పీఎస్ ఎస్సై-1 మహేశ్ ను వీఆర్ కు పంపించారు.
మెండోరా ఎస్సై నారాయణను వీఆర్‌కు అటాచ్ చేశారు.రెండో టౌన్లో ఉన్న ఎస్సై యాసిర్ అరాఫత్ ను మెండోరా ఎస్సైగా నియమించారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా పీఎస్ ఎస్సై మాలిక్ రెహమాన్‌ను జక్రాన్‌పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. జగిత్యాల్ వీఆర్‌లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్‌ను రెండో ఎస్సై-1గా బదిలీ చేశారు.
