ఎట్టకేలకు కొత్త కొత్వాల్ కొరడా పట్టారు.దారి తప్పిన అధికారులను తన దారిలోకి తెచ్చే కార్యాచరణ కు శ్రీకారం చుట్టారు ఏకంగా నలుగురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించారు వారిని విఆర్ లోకి పంపారు.
కల్మేశ్వర్ బదిలీ తర్వాత కొత్త కమిషనర్ ను నియమించే విషయంలో ప్రభుత్వం నెలల తరబడిగా జాప్యం చేసింది. ఇంకేముంది ఎస్సై సీఐ లు యథేచ్ఛగా చెలరేగిపోయారు. ఇసుక… పీడీఎస్ మొరం బెట్టింగ్ మట్కా లాంటి దందాలకు నిసిగ్గుగా తెరలేపారు.
ఏకంగా కానిస్టేబుళ్లు హోంగార్డ్ లను ఇదే పనిలో ఎంగేజ్ చేసుకున్నారు. అక్రమ దందాలు చేసే వారితో బాహాటంగా చేతులు కలిపారు. ఆయా దందాలో పేరుమోసిన నేరగాళ్ల ను స్టేషన్ కు పిలిచి అతిధి మర్యాదలు చేస్తూ వచ్చారు. మామూళ్లకోసం హద్దుకూడా చెరిపేసారు.
ఎలాగో పర్యవేక్షణ చేసే అధికారులు నోరెత్తకుండావాటాలు ఇచ్చేసారు. అందుకే కేసుల నమోదు ఆయా కేసుల దర్యాప్తు లు సైతం దారి మళ్ళాయి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వచ్చి రాగానే జిల్లాను ఓ దఫా చుట్టేశారు కమిషనరేట్ పరిధి యథేచ్ఛగా సాగుతున్న ఆయా దందాలు చిట్టా ను సైతం ఆనతి కాలం లోనే సిద్ధం చేసుకున్నారు.
జిల్లా సామాజిక రాజకీయ పరిస్థితులను నిశితంగా ఆకళింపు చేసుకున్నారు. ఆ తర్వాతే యాక్షన్ లోకి దిగారు.ఆయా దందాలు ముప్పేట దాడులు చేయిస్తునే సొంత శాఖలోనే దారి తప్పిన అధికారుల మీద కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు.ఇద్దరు సీఐ ల మీద కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసారు. సోమవారం జిల్లా కమిషనరేట్ పరిధిలోనీ నలుగురు ఎస్ఐ లను స్టేషన్ బాధ్యతల నుంచి తప్పించి వీఆర్ కు అటాచ్ చేస్తూ.
ఇందల్వాయి ఎస్ఐ గా పనిచేసిన మనోజ్ కుమార్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. అలాగే జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ తిరుపతిని వీఆర్ కు అటాచ్ చేశారు.వీరిద్దరి మీద మానవ హక్కుల తాలూకు వివాదాలున్నాయి. డిచ్ పల్లి ఫరీది లోనే ఇద్దరు ఎస్సై ల మీద వేటు పడింది.
ఆర్మూర్ పీఎస్ ఎస్సై-1 మహేశ్ ను వీఆర్ కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్‌కు అటాచ్ చేశారు.అలాగే వీఆర్ లో ఉన్న సందీప్ ను ఇందల్వాయి ఎస్ఐ గా బదిలీ చేశారు. సీసీఎస్ లో ఉన్న రమేశ్ ను ఆర్మూర్ పీఎస్ ఎస్సై-1గా నియమించారు. రెండో టౌన్లో ఉన్న ఎస్సై యాసిర్ అరాఫత్ ను మెండోరా ఎస్సైగా నియమించారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా పీఎస్ ఎస్సై మాలిక్ రెహమాన్‌ను జక్రాన్‌పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. జగిత్యాల్ వీఆర్‌లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్‌ను రెండో ఎస్సై-1గా బదిలీ చేశారు.దీనితో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఏకంగా నలుగురు ఎస్సై ల మీద చర్యలు తీసుకోవడం వెనుక కారణాల మీద చర్చ జరుగుతుంది. అవినీతి అలసత్వం వైఖరుల మీద కొత్వాల్ కఠినంగా ఉండబోతున్నారనే సంకేతాలు మాత్రం స్పష్టంగా వచ్చాయి
