HomeTelanganaNizamabadవిద్య శాఖ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన - ఎమ్మెల్యే ధన్...

విద్య శాఖ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన – ఎమ్మెల్యే ధన్ పాల్

ఇందూర్ నగరం :గౌతమ్ నగర్ ఓల్డ్ స్నేహ సొసైటీ పక్కన విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGEWIDC) ఆధ్వర్యంలో నిర్మించానున్న మండల వనరుల కేంద్ర భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు నిజామాబాదు నార్త్ విద్య శాఖ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణం పనులు అంచనా విలువ 40.70 లక్షల వ్యయంతో పనుల ప్రారంభనికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.భవన నిర్మాణ పనులు నాణ్యతో త్వరతగతిన పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కి సూచించడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలో రాబోయే విద్య సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరిగేల తల్లి తండ్రుల్లో అవగాహన తీసుకురావాలని జిల్లా విద్య అధికారికి సూచించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి విద్య శాఖ అధికారులు ఘన స్వాగతం పలికి వారిని సత్కారించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో DEO అశోక్ గారు, MEO వెంకట నారాయణ గారు, AE ఉదయ్ కిరణ్ గారు, కాంట్రాక్టర్ యాదగిరీ గారు,అధికారులు ఉపాధ్యాయులు,బీజేపీ నాయకులు, మాయావర్ సాయి రం, రంజిత్, సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments