ఇంటర్ ఫలితాల్లో మొత్తం జిల్లాలో 59.25 శాతం..రెండవ సంవత్సరం 59.25% ఉత్తీర్ణత..మొదటి సంవత్సరంలో 53.37% ఉత్తీర్ణత..ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు.మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.
దీంతో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ బోర్డులో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో మొత్తం జిల్లాలో 59.25 శాతం మంది ఉత్తీర్ణత అయినట్లు ఇంటర్ విద్యా శాఖ అధికారీ రవికుమార్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షలలో జిల్లాలో రెండవ సంవత్సరం విద్యార్థులు 59.25% ఉత్తీర్ణత సాధించారు.
మొదటి సంవత్సరంలో 53.37% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారనీ వెల్లడించారు. కాగా బాలికల ఉత్తీర్ణత శాతం పైచేయిగా నిలిచిందనీ తెలిపారు. మొత్తం బాలికలు రెండవ సంవత్సరంలో 70% మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 45 శాతం ఉత్తీర్ణత సాధించారనీ అన్నారు.
అలాగే మొదటి సంవత్సరంలో బాలికలు 64% సాధించగా బాలురు 41 శాతం ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్ జిల్లాలో రెండవ సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,657 మంది హాజరుకాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు.
అలాగే బాలురు 6,288 మంది పరీక్షలకు హాజరు కాగా 2,808 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం ఒకేషనల్ లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరుకాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 814 మంది పరీక్షలకు హాజరుకాగా 666 మంది ఉత్తీర్ణులయ్యారు.
బాలురు 1,228 మంది పరీక్షలకు హాజరు కాగా 565 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల విద్యార్థులు మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 8,035 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు.
మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,111 మంది హాజరు కాగా వీరిలో 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,679 మంది పరీక్షలకు హాజరుకాగ 467 మంది ఉత్తీర్ణులయ్యారనీ ఆయన పేర్కొన్నారు.
