రాత్రి వేళ కిరాణా దుకాణం తెరిచి ఉంచిన యజమానికి జైలు శిక్ష విధించినట్లు రెండో టౌన్ ఎస్ హెచ్ వో యాసీర్ అరాఫత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
షేక్ జుబేర్ అనే వ్యక్తి రాత్రి కిరాణా దుకాణం తెరిచి ఉంచడంతో అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ కిరాణా దుకాణం యజమాని జుబేర్ కు నాలుగు రోజుల జైలు శిక్ష విధించిందన్నారు.
వ్యాపారులు తమ దుకాణాలను నిర్ణీత సమయంలోగా మూసివేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని యాసీర్ అరాఫత్ స్పష్టం చేశారు.
