పోతంగల్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ చౌరస్తా వద్ద బుధవారం. పోతంగల్ మండలం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
కొనుగోలు వేగవంతం చేయాలని, కాంటలు చేసిన సంచులను వెంటనే లారీలో తరలించాలని, అలాట్మెంట్ నిజామాబాద్ కాకుండా లోకల్ రైస్ మిల్లులకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ విగ్ర ఆవిష్కరణకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్తుండగా, రైతులను చూసి, రైతుల దగ్గరకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అడిగి తెలుసుకున్న పోచారం, డిఎం సివిల్ సప్లై వారితో, మాట్లాడి ఈరోజు సాయంత్రం వరకు గన్ని సంచులతో పాటు లారీలను అరేంజ్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై రైతులతో మాట్లాడి, నచ్చ చెప్పడంతో, రైతులు ధర్నాను విరమించారు.
