అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్బంగా కోటగాల్లిలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పూల మాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని ఆయన జరిపిన సాయుద పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రతేక అధ్యాయానికి నాంది పలికిందన్నారు.
తెలుగు జాతి పౌరుషన్ని ప్రపంచానికి చాటిన వీర కిషోరం మన అగ్గిపిడుగు అల్లూరి అని పేర్కొన్నారు.మన్యం ప్రజల మాన, ప్రాణ రక్షణకు తెల్ల దొరలను ఎదురించి, గిరిజన జాతిని ఏకం చేసి అణగారిన గిరిజన జాతిలో విప్లవ చైతన్యాన్ని రగిలించి గేరిళ్ల యుద్ధ నైపుణ్యలను నేర్పించి బ్రిటిష్ సామ్రాజన్ని గడ గడలడించిన వీరుడు మన అల్లూరి.
ఆ మహావీరుడు గిరిజన జాతికే కాదు యావత్తు భారత దేశానికే ఆదర్శప్రాయం.భారత మాత దాస్య శృంకాలను తెంచడానికి సాగిన సమరంలో తన ప్రాణాలను త్యాగం చేసిన వీరుడు అల్లూరి అని కొనియాడారు.
అటువంటి మహనీయున్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోని సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదురించే విధంగా, భారత దేశం (భారత మాత )కోసం అవసరం అయితే ప్రాణత్యాగానికి కూడా వెనుకడుగు వేయకూడని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నరేద్రమోదీ గారు అల్లూరి సీతారామరాజు పోరాటాలకు గుర్తుగా 125వ జయంతి రోజు అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
