ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ కి శ్రీ చైతన్య విద్యా సంస్థ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అడ్మిషన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా టీ జి వి పి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… జిల్లా శివారులోని కంఠేశ్వర బైపాస్ నేషనల్ మార్ట్ వెనక కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా నిర్మాణం కానీ భావనన్నీ ప్రాస్పెక్టస్ లో పెట్టి అడ్మిషన్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలకే సరైన అనుమతులు లేకపోగా,ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో భవనాన్ని చూపి విద్యాశాఖ అధికారులనుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్స్ చేసి విద్యార్థుల తల్లి తలిదండ్రులని మోసం చేస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నారు
వెంటనే వారిని పట్టుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలియాని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నూతన విద్యా సంవత్సరం మొదలు కానుండటం తో అనుమతలు లేకుండా వస్తున్న శ్రీచైతన్య,మరియు ఇతర పాఠశాలపై విద్యాశాఖ అధికారీ గారిచే పత్రికసమావేశం పెట్టి అడ్మిషన్స్ చేసి తల్లి తండ్రులు మోసపోకుండా చేయాలి
తీసుకొనేలా పురమాయించాలని కోరారు,ఇంతకు ముందే వెలసిన శ్రీచైతన్య పాఠశాల బ్రాంచ్ పైన అనేక మార్లు పిర్యాదు చేసిన కఠినమైన చర్యలకు విద్యాశాఖ వెనకడుతుందని అన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
అదనపు కలెక్టర్ అంకిత్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు ఇస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో నగర నాయకుడు వినయ్ తదితరు పాల్గొన్నారు.
