వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. మెకిలాలో114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యజమాని సామ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆయనపై మోకిలా చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్‌తో పాటు.. తనను, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు ఇవాళ మరోసారి ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది.
