HomePOLITICAL NEWSAndhra Pradeshమావోయిస్టు లకు భారీ ఎదురుదెబ్బ …….కేంద్ర కమిటీ కార్యదర్శి హతం ……మృతుడు చంద్రబాబు ఫై దాడి...

మావోయిస్టు లకు భారీ ఎదురుదెబ్బ …….కేంద్ర కమిటీ కార్యదర్శి హతం ……మృతుడు చంద్రబాబు ఫై దాడి కేసులో నిందితుడు ……ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 26 మంది మృతి ……

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి తో పాటు 26 మంది .

మావోయిస్టులు మృత్యువాత పడ్డారు మావోయిస్టు ఏరివేతకు కేంద్రం చేపట్టిన చేపట్టిన ఆపరేషన్ కాగర్ భాగంగా బుధవారం గాలింపు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో.

ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల్లో అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. మరో పది మందికి గాయాలయ్యాయి..

ఇది మావోయిస్ట్ పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ . హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో 26మంది మావోలు చనిపోయారు.
నంబాల కేశవరావు,అలియాస్ బసవరాజ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి.గా ఉన్నారు .

గతంలో సీఎం గా ఉన్న చంద్ర బాబు మీద అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో ప్రధాన నిందితుడుగా ఉన్నారు

1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించిన నంబాల కేశవరావు ఆర్ ఐ సి వరంగల్ నుండి బి.టెక్ పట్టా పొందారు.


మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నంబాల కేశవరావు 1970 నుండి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఏర్పడిన సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌లో
ముఖ్యమైన సభ్యుడు.

1987లో, ఆయన శ్రీలంకలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం నుండి అంబుష్ వ్యూహాలు మరియు పేలుడు పదార్థాల వినియోగంపై శిక్షణ పొందారు.

2004లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ మరియు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) విలీనంతో ఏర్పడిన సీపీఐ (మావోయిస్టు) పార్టీకి కేంద్ర సైనిక కమిషన్ నియమితులయ్యారు.


2018 నవంబర్ 10న, ముప్పల లక్ష్మణ రావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత, నంబాల కేశవరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

నంబాల గెరిల్లా యుద్ధ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. నంబాల పై ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. భద్రతా దళాలపై జరిగిన పలు ప్రధాన మావోయిస్టు దాడుల్లో
నంబాల పాత్రే కీలకం.


నంబాల కేశవరావు పై రూ 1 కోటి రివార్డ్ కూడా ఉంది . నంబాల భార్య రాజే కాంగే కూడా మావోయిస్టు పార్టీ లో నే కీలక స్థానం లో ఉన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments